Share News

Geyser hack: గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ.. వేడి నీటి కోసం ఎలాంటి ట్రిక్ కనిపెట్టాడో చూడండి..

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:26 AM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Geyser hack: గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ.. వేడి నీటి కోసం ఎలాంటి ట్రిక్ కనిపెట్టాడో చూడండి..
geyser alternative

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (winter bathing trick).


సాధారణంగా చలికాలం వస్తే అందరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. అయితే అందరి ఇళ్లలోనూ గీజర్లు ఉండవు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి తన ట్యాలెంట్‌ను ఉపయోగించాడు. ఆ వీడియోను @DashrathDhange4 అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి బాత్రూమ్ కుళాయి కింద ఖాళీ నూనె డబ్బాను ఉంచాడు. ఆ డబ్బా కింద ఉన్న పాన్‌లో నిప్పు మండుతోంది. కుళాయి నుంచి నీరు డబ్బాలో పడగానే, కింద ఉన్న మంట కారణంగా ఆ నీరు వేడుక్కుతోంది (canister invention).


ఆ డబ్బాకు అమర్చిన పైప్ ద్వారా ఆ వేడి నీరు బయటకు వస్తోంది (shocking invention). అది ఒక హాట్ షవర్ బాత్‌లా పని చేస్తోంది. ఎలాంటి కరెంట్ బిల్లూ లేకుండా ఆ వ్యక్తి చేసిన జుగాడ్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. 'శీతాకాలంలో స్నానం చేయడానికి కొత్త ట్రిక్, గీజర్ కంపెనీలు షాక్‌లో ఉన్నాయి' అని ఒకరు పేర్కొన్నారు. 'అతనికి వెంటనే భారతరత్న ఇవ్వాలి.. ఇతను గీజర్ కంపెనీలను దివాళా తీయించేలా ఉన్నాడు' అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..


మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. పక్షుల మధ్య సీతాకోక చిలుకను 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2025 | 11:26 AM