Share News

Water expiration date: వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:14 AM

ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు, ప్రయాణ సమయాల్లోనూ అందరం వాటర్ బాటిల్స్‌ను కొని మంచి నీళ్లు తాగుతుంటాం. ఆ నీరు చాలా శుభ్రమైనదని, సురక్షితమైనదని అందరూ భావిస్తుంటాం. అయితే సీల్ చేసిన ఆ వాటర్ బాటిల్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.

Water expiration date: వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..

ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు, ప్రయాణ సమయాల్లోనూ అందరం వాటర్ బాటిల్స్‌ను కొని మంచి నీళ్లు తాగుతుంటాం. ఆ నీరు చాలా శుభ్రమైనదని, సురక్షితమైనదని అందరూ భావిస్తుంటాం. అయితే సీల్ చేసిన ఆ వాటర్ బాటిల్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. చాలా మంది వాటర్ బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్‌ను పట్టించుకోరు. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన తర్వాత వాటర్ బాటిల్‌ను ఉపయోగించడం ప్రమాదకరం (bottled water expiration date).


నిజానికి మంచి నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. నిజానికి నీరు ఎప్పటికీ పాడవదు. మురికి అవకుండా శుభ్రంగా ఉంటే మంచి నీటిని ఎప్పుడైనా తాగొచ్చు. నీటిని మురికి పాత్రలో ఉంచినా లేదా బహిరంగ ప్రదేశంలో వదిలేసినా, అందులో మురికి కలిసిపోవడం వల్ల అది తాగడానికి పనికిరానిదిగా మారుతుంది. మరి, బాటిల్ వాటర్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకుంటుంది? (water shelf life)


నిజానికి వాటర్ బాటిల్‌పై గడవు తేదీ అనేది నీటి గడువు తేదీని సూచించేది కాదు.. బాటిల్ గడువు తేదీని సూచించేది (plastic bottle chemicals). రోజులు గడిచే కొద్ది.. ప్లాస్టిక్ నీటిలో కరగడం ప్రారంభమవుతుంది. ఇది నీటి రుచిని మార్చగలదు. నీటి నాణ్యతను దిగజార్చగలదు. ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకే బాటిళ్లకు గడువు తేదీలు ఉంటాయి. ఇకపై వాటర్ బాటిల్‌ను కొనే ముందు తప్పనిసరిగా దానిపై ఉండే ఎక్స్‌పైరీ డేట్‌ను సరి చూసుకోండి.


ఇవి కూడా చదవండి..

థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..


మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో చేప, ఓ వృద్ధుడు ఉన్నారు.. ఎక్కడో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 08 , 2025 | 11:49 AM