Jaguar anaconda fight: థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:19 PM
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ అనకొండను వేటాడుతున్న చిరుతకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ అనకొండను వేటాడుతున్న చిరుతకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (jaguar drags anaconda).
@jaguars_pantanaltours అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చెరువు ఒడ్డున ఉన్న పొదల్లో అనకొండ ఉంది. దానిని ఓ చిరుత చూసింది. ఆ అనకొండపై దాడికి దిగింది. ఆ అనకొండను తన నోటితో పట్టుకుని బయటకు లాగింది. దానిని పట్టుకుని ముందుకు రెండడుగులు వేసింది. ఆ సమయంలో అనకొండ తన ప్రతాపం చూపించింది. ఆ చిరుత నోటిని గట్టిగా చుట్టేసింది. దీంతో చిరుత ఆ అనకొండను అక్కడే వదిలించుకుని పరిగెత్తి పారిపోయింది (spine chilling animal video).
ఈ అరుదైన ఘటనను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (jaguar vs snake). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అడవిలో ఆహారం కోసమైనా, ప్రాణం కోసమైనా పోరాడుతూ ఉండాల్సిందేనని ఒకరు కామెంట్ చేశారు. అనకొండను వేటాడడం అంత సులభం కాదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..
మీ దృష్టి షార్ప్ అయితే.. ఈ ఫొటోలో తోడేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..