Share News

farmer fertilizing trick: వావ్.. రైతులకు ఉపయోగపడే ట్రిక్.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:13 PM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

farmer fertilizing trick: వావ్.. రైతులకు ఉపయోగపడే ట్రిక్.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూడండి..
riculture hack video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (viral farming video).


humoursgagg అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు పొలంలో ఎరువులు చల్లడానికి అద్భుతమైన ట్రిక్ కనిపెట్టాడు. ముందుగా ఎరువుల బస్తాను మధ్యలోకి కట్ చేశాడు. సంచి నుంచి యూరియాను బయటకు వేశాడు. ఆ సంచిని పొడవుగా మడిచి రెండు చివరలను కట్ చేశాడు. అలా కట్ చేయడంతో ఆ సంచి కాస్తా పొడవైన షర్ట్‌లా మారిపోయింది. ఆ షర్ట్ వేసుకుని మధ్యకు మడిచి అందులో ఎరువులు వేసుకుని సులభంగా పొలంలో చల్లుతున్నాడు (unique farming method).


ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (farmer innovation). ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. దాదాపు 60 వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. చాలా మంచి ఆలోచన అని కొందరు ప్రశంసించారు. అలా చేయడం వల్ల సంచి వేస్ట్ అవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి..

టామ్ క్రూజ్‌ను తలపించాడుగా.. విమానం తోక భాగంలో చిక్కుకున్న స్కై డైవర్..


మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ కాండీల మధ్యనున్న బటన్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2025 | 12:13 PM