skydiver incident: టామ్ క్రూజ్‌ను తలపించాడుగా.. విమానం తోక భాగంలో చిక్కుకున్న స్కై డైవర్..
ABN , Publish Date - Dec 12 , 2025 | 08:50 AM
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ హీరో టామ్ క్రూజ్ చేసే సాహసాలు గొప్ప థ్రిల్లింగ్‌గా ఉంటాయి. వేల అడుగుల ఎత్తులో విమానాలకు వేలాడుతూ టామ్ చేసే సాహసాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ స్కై డవర్ సాహసం చేయబోయి ప్రమాదంలో చిక్కుకున్నాడు.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ హీరో టామ్ క్రూజ్ చేసే సాహసాలు గొప్ప థ్రిల్లింగ్‌గా ఉంటాయి. వేల అడుగుల ఎత్తులో విమానాలకు వేలాడుతూ టామ్ చేసే సాహసాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ స్కై డవర్ సాహసం చేయబోయి ప్రమాదంలో చిక్కుకున్నాడు. భూమి నుంచి 15 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం తోకకు వేలాడుతూ ఉండిపోయాడు. ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది (15,000 feet skydiving accident).
ఆస్ట్రేలియాలోని దక్షిణ కెయిర్న్స్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొందరు ఔత్సాహికులు స్కై డైవ్ చేసేందుకు విమానం నుంచి కిందకు దూకుతున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి పారచూట్ విమానం వెనుక ఉండే తోక భాగానికి చిక్కుకుంది. దీంతో ఆ వ్యక్తి అన్ని వేల అడుగుల ఎత్తులో గాల్లోనే వేలాడుతూ ఉండిపోయాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (parachute caught on plane tail).
అనుకోకుండా అంత భారీ ప్రమదానికి గురైన ఆ స్కై డైవర్ సురక్షితంగానే బయటపడినట్టు అధికారులు వెల్లడించారు (skydiving video Australia). ఈ ప్రమాదంలో స్కై డైవర్‌కు ఏమీ కాలేదని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు చేస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ స్కైడైవర్‌ను చూస్తుంటే టామ్ క్రూజ్ గుర్తుకొస్తున్నాడని చాలా మంది వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
మోదీ-పుతిన్ సెల్ఫీ.. అమెరికాలో భయాందోళనలు.. ట్రంప్‌పై విమర్శలు..
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్