Share News

Husband wife moment: ఏంది బ్రో ఇలా చేశావ్.. భార్య పక్కనుండగా ఇలా చేయడానికి ఎంత ధైర్యం..

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:34 AM

తాజాగా ఓ వ్యక్తి కేక్ కట్ చేసిన తర్వాత భార్యకు ఇచ్చిన ట్విస్ట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.

Husband wife moment: ఏంది బ్రో ఇలా చేశావ్.. భార్య పక్కనుండగా ఇలా చేయడానికి ఎంత ధైర్యం..
cake cutting incident

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కేక్ కట్ చేసిన తర్వాత భార్యకు ఇచ్చిన ట్విస్ట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు (cake cutting incident).


@nandantwts అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ఒక జంట వివాహ వార్షికోత్సవానికి సంబంధించినది. టేబుల్ మీద ఉంచిన అందమైన కేక్‌ను భర్త తన భార్యతో కలిసి కట్ చేశాడు. ఆ తర్వాత అతడు కేక్ ముక్కను తీసుకుని తన భార్యకు కాకుండా తల్లికి తినిపించేందుకు ప్రయత్నించాడు. వెంటనే తల్లి అడ్డుకుని, ముందుగా భార్యకు తినిపించమని చెబుతుంది. దీంతో అతడు భార్య వైపు తిరిగాడు. అయితే అతడు చేసిన పని వల్ల అప్పటికే అతడి భార్యకు కోపం వచ్చేసింది. భర్త వైపు కోపంగా చూడడం కనిపిస్తోంది (surprising cake cutting twist).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (trending couple story). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.1 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇలా చేసినందుకే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందని ఒకరు కామెంట్ చేశారు. పాపం.. అతడి పరిస్థితి ఏమైందని మరొకరు కామెంట్ చేశారు. తల్లి స్థానంలోకి ఎవరూ ఎప్పటికీ రాలేరని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

టామ్ క్రూజ్‌ను తలపించాడుగా.. విమానం తోక భాగంలో చిక్కుకున్న స్కై డైవర్..


మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ కాండీల మధ్యనున్న బటన్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2025 | 10:34 AM