Share News

Gujarat: నువ్వు గ్రేట్ భయ్యా.. కొండచిలువకు సీపీఆర్ చేసి..

ABN , Publish Date - Dec 10 , 2025 | 06:44 PM

గుండెపోటు.. ఇతర కారణాల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తుంటారు. మనిషికి మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ఓ కొండచిలువకూ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

Gujarat: నువ్వు గ్రేట్ భయ్యా.. కొండచిలువకు సీపీఆర్ చేసి..
CPR to Python

సాధారణంగా మనిషి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాసను అందించి ప్రాణాలు కాపాడిన ఘటనలు తరుచూ చూస్తూనే ఉంటాం. దీన్నే సీపీఆర్ అని అంటారు. గుండెపోటు, కరెంట్ షాక్ తో కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనిషికి ఓకే.. మరి పాముకు అలాంటి పరిస్థితి వస్తే..? దానికి సీపీఆర్ ఎలా చేస్తారు.. ఊహించుకుంటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది కదా..!. అలాంటిదే గుజరాత్‌లో జరిగింది. జంతు సంక్షేమ కార్యకర్త సీపీఆర్ చేసి ఓ కొండ చిలువకు ప్రాణం పోశాడు. అందరినీ షాక్ కి గురి చేసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


గుజరాత్‌లోని నర్మద జిల్లా.. డెడియాపాడా మండలం కోలీవాలా గ్రామంలోని ఒక పొలంలో కొండ చిలువ (పైథాన్) తలకు గాయపడి స్పృహ కోల్పోయింది. గ్రామస్థులు చూసి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. జీవదయా ప్రేమీ సంస్థకు చెందిన జంతు సంరక్షకులకు ఫోన్ చేసి పిలిపించారు. భవిన్ భాయ్ వాసవా ఆ కొండ చిలువ దగ్గరకు వెళ్లి సీపీఆర్ చేశాడు. ఓ చిన్న రాడ్డును పైథాన్ నోటిలో పెట్టి తన నోటితో శ్వాస అందించాడు. అలా కొన్ని నిమిషాలపాటు సీపీఆర్ చేశాడు.


దీంతో పాములో కదలికలు గమనించి మరికొంత సేపు అలాగే శ్వాస అందించాడు. మొత్తానికి ఆ పాము స్పృహలోకి వచ్చింది. అది ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత అటవీశాఖ అధికారులు అడవిలోకి వదిలివేశారు. ఇదే తరహా ఘటన వల్సాద్ లో చోటు చేసుకుంది. ఓ పాము త్రీ ఫేజ్ విద్యుత్ లైన్ ఎక్కి విద్యుదాఘాతానికి గురై దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి నేలపై పడి స్పృహ కోల్పోయింది. ముఖేష్ వాయద్ అనే వ్యక్తి పాముకు నోటి ద్వారా శ్వాస అందించి సీపీఆర్ చేశాడు. దాదాపు 30 నిమిషాలపాటు దాని గుండె ప్రాంతాన్ని నొక్కి ఊపిరి పోశాడు. ఇలా సీపీఆర్ ద్వారా మనిషిని మాత్రమే కాదు.. పశు పక్షాదులనూ కాపాడుతు మానవత్వాన్ని చాటుకుంటున్నారు జంతు ప్రేమికులు.


ఈ వార్తలు కూడా చదవండి:

Lionel Messi India Tour: హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

Viral Breakup at Gujarat: ఉల్లి తెచ్చిన లొల్లి.. 23 ఏళ్ల వివాహ బంధానికి తెర.!

Updated Date - Dec 10 , 2025 | 07:49 PM