Home » Vijayawada
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేశ్.. సిట్ కార్యాలయంలో లొంగిపోయాడు.
ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు.
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. మొత్తం 25 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు.
స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు సత్తా చాటాయి. సోమవారం, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన ఐదో ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డుల్లో.. మిలియన్ ప్లస్ కేటగిరీ మొదలుకొని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి.
ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
అకడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరమని ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సూచించారు. శనివారం విజయవాడలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
నర్సింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూ.60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ చైర్స్, సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు ప్రారంభించారు.
విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.