Sankranthi Festival: సంక్రాంతికి శివార్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:06 AM
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్‌బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ, తెలంగాణ(AP, Telangana) జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత(Srilatha) తెలిపారు. స్పెషల్ ఆపరేషన్స్‌పై మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సోమవారం పోలీస్, ట్రాఫిక్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ రాయలసీమ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్..

ఉత్తర తెలంగాణకు జేబీఎస్.. విజయవాడ(Vijayawada), నల్లగొండ, ఖమ్మం(Khammam) ప్రాంతాలకు ఎల్‌బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు చెప్పారు. సౌత్‌జోన్, సుల్తాన్ బజార్ రాజేంద్రనగర్ ఏసీపీలు కె.లక్ష్మణ్, కె.శ్రీనివాస్, డి.సుధీర్‌రెడ్డి, ఆర్టీసీ అధికారులు మహాంకాళి, ఎన్.జానకిరాం, ట్రాఫిక్ సీఐలు వి.మదన్‌లాల్, జి.బాలకృష్ణ పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News