Parakamani Case: కోర్టులో ఉంది.. అన్నీ చెప్పలేం.. పరకామణి కేసుపై ఏసీబీ డీజీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:06 PM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉందని.. అన్నీ చెప్పలేమని తెలిపారు.
విజయవాడ, జనవరి 2: తిరుమల పరకామణి కేసుపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్ (ACB DG Atul Singh) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున పూర్తి సమాచారం చెప్పలేమని తెలిపారు. కానీ.. కోర్టు డైరెక్షన్ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసు బుక్ చేసిన తర్వాత విచారణ మొత్తం పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుందని.. సిబ్బంది తక్కువుగా ఉన్నందున అన్ని కేసులను దర్యాప్తు చేయడం సాధ్యం కావడం లేదని తెలిపారు. చిన్న ఎమౌంట్ ఉన్న కేసులు ఉంటే.. ఆయా శాఖలకే చర్యలు తీసుకోవాలని రాస్తున్నామ్నారు. పెద్ద మొత్తం డిమాండ్ చేసే వారిపైనే తాము ఇప్పుడు దృష్టి పెట్టామని చెప్పారు. గత నాలుగైదు నెలలుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇండియాలో క్రికెట్‌కు బాగా క్రేజ్ ఉందని.. టెండూల్కర్, విరాట్ వంటి వారు త్వరగా అవుట్ అయితే జోక్స్ చేస్తామని.. అదే విధంగా అవినీతి నిర్మూలనపై కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు అటువైపు నుంచి మాట్లాడతారని చెప్పారు. ఇటువైపు కూడా వచ్చి చూస్తే కన్విన్షన్ వరకు కేసు విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏసీబీకి ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లే ప్రజల నుంచి చిన్న మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రజలు దీనిపై తమకు ఫిర్యాదులు చేస్తే.. ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఏసీబీ డీజీ తెలిపారు.
ఏసీబీ దృష్టికి వచ్చే ఫిర్యాదుల్లో తమ ప్రధాన కార్యాలయంలో చర్చించి.. ఆ తర్వాత ప్రాధాన్యతను బట్టి దాడులు చేస్తామని వివరించారు. ఏసీబీ టీం నుంచి సమాచారం ముందుగా లీక్ అవుతుందనేది వాస్తవం కాదన్నారు. ఏసీబీ కార్యాలయంలో ఎప్పుడూ ఇంటర్నల్ విజిలెన్స్ ఉంటుందని చెప్పారు. తాము అన్నీ ముందుగానే చర్చించలేమని.. దర్యాప్తులో అనేక అంశాలను తీసుకుని ముందుకు సాగుతామని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడ్లు
రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?
Read Latest AP News And Telugu News