Vijayawada: నకిలీ మద్యం కేసులో నలుగురికి పోలీస్ కస్టడీకి ఎక్సైజ్ కోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:34 PM
విజయవాడ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని విచారించేందుకు ఎక్సైజ్ కోర్టు అనుమతినిచ్చింది.
విజయవాడ, జనవరి 07: గత కొన్ని నెలల నుంచి సంచలనంగా మారిన విజయవాడ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురుని విచారించిన ఎక్సైజ్ కోర్టు తాజాగా మరో నలుగురిని విచారించేందుకు అనుమతినిచ్చింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన నకిలీ మద్యం రాకెట్‌లో ప్రధాన నిందితులకు సహకరించిన వారిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా నకిలీ మద్యం కేసులో బాలాజీ (A3), తలారి రంగయ్య (A14), సుదర్శన్ (A21), ప్రసాద్ (A23) లను శుక్రవారం నుంచి సోమవారం వరకు కస్టడీకి ఎక్సైజ్ కోర్టు అనుమతినిచ్చింది.
నిందితుల నుంచి మరింత కీలక సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉందని భావించిన ఎక్సైజ్ కోర్టు.. పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈ కస్టడీని అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నలుగురి కస్టడీ ద్వారా నకిలీ మద్యం కేసులో మరిన్ని కీలక అధారాలు లభిస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News