Share News

CM Chandrababu: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:35 PM

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

అమరావతి, జనవరి 07: పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని.. గడువులోగా మిగిలిన పనులన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల పునరావాసంతోపాటు ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను తనిఖీ చేస్తానని వారికి సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు డిన్నర్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు.. ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల తమకు భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయంటూ పలు రాష్ట్రాలు ఇప్పటికే న్యాయ స్థానాలను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈ భేటీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 11.00 గంటలకు ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు. అర్ధరాత్రి 1:30 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు సీఎం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. సిట్ చేతికి ఆ రిపోర్ట్..

నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

For More AP News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 04:09 PM