Guntur Chili Season Issues: నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:02 PM
గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు.
గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ‘మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండటంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గత ఏడాది1,90,000 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,06,000 హెక్టార్లలో సాగు చేశారు’..
‘..రైతులు మొక్కజొన్న సాగుకు వెళ్లారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి పెట్టినా రుణాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకున్న మిర్చికి రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి మిర్చి గుంటూరు యార్డుకు వస్తుంది. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలు రికార్డు చేస్తున్నాం. నూటికి నూరు శాతం ఈ-క్రాప్ చేస్తున్నాం. ట్రాన్స్‌పోర్ట్ సమస్యను పరిష్కరించాం. నల్లి తామర వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్ష సూచన
కీలక పరిణామం.. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీసులు