Phone Tapping Case: కీలక పరిణామం.. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీసులు
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:29 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌కి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
9 గంటల పాటు నవీన్ రావు విచారణ
రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారించారు. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. బీఆర్ఎస్ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాల గురించి నవీన్ రావును అధికారులు విచారించినట్లు సమాచారం. విచారణ అనంతరం నవీన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో విచారణకు హాజరయ్యానని, అప్పట్లో మూడు గంటల పాటు అధికారులు తనను విచారించారని చెప్పారు. అప్పుడు చెప్పిన విషయాలనే ఇప్పుడు కూడా చెప్పానని అన్నారు. విచారణకు సహకరించానని, మళ్లీ పిలిచినా కూడా వస్తానని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..
ఐబొమ్మ రవికి షాక్.. ఆ ఐదు కేసుల్లోనూ..