Imandi Ravi Bail Plea: ఐబొమ్మ రవికి షాక్.. ఆ ఐదు కేసుల్లోనూ..
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:52 AM
ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి కోర్టును ఆశ్రయించాడు.
సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి కోర్టును ఆశ్రయించాడు. తాజాగా, ఈ బెయిల్ పిటిషన్‌లపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు దశలో ఉందని, అతను విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు రవి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది.
కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టును పోలీసులు గత బుధవారం కోర్టుకు సమర్పించారు. అందులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఐబొమ్మ రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్‌లను కొనుగోలు చేశాడు. నార్మల్ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించాడు. అతడికి సంబంధించిన ఏడు ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటిలో రూ.13.40 కోట్ల నగదు ఉన్నట్లు కనుగొన్నారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి తన సోదరి చంద్రికకు రూ. 90 లక్షల నగదు పంపినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి
త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు..
గుడిలో భారీ చోరీ.. ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు