Share News

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. సిట్ చేతికి ఆ రిపోర్ట్..

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ మంగళవారం కోర్ట్‌కు చేరింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. సిట్ చేతికి ఆ రిపోర్ట్..
AP liquor scam

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL report) రిపోర్ట్ మంగళవారం కోర్ట్‌కు చేరింది. నేడు (బుధవారం) కోర్టు నుంచి ఆ రిపోర్టును సిట్‌ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ రిపోర్ట్ ద్వారా ఏం బయటపడుతుందో అని నాయకులు, అధికారులు ఆందోళన చెెందుతున్నారు(Andhra Pradesh liquor case).


లిక్కర్‌ స్కామ్ బయటపడటంతో గతంలో ఫోన్లను నిందితులు నాశనం చేశారు(liquor scam probe update). ఆ ఫోన్లలోని డేటా, కాల్ రికార్డులు, డిలీట్ చేసిన ఫైల్స్ తదితర డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తయింది. ఆధునిక సాంకేతిక ద్వారా నాశనం అయిన డేటాను ఫోరెన్సిక్ టీమ్ రికవరీ చేసినట్టు సమాచారం. ఆ రిపోర్ట్ సిట్ చేతికి అందితే కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్ లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.


Also Read:

సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..

Updated Date - Jan 07 , 2026 | 02:44 PM