Home » Vijayawada News
ఇంటర్‌మీడియట్‌కు వచ్చినప్పడు మంత్రి నారయాణ తనకు బ్రిడ్జి కోర్స్ నేర్పించారని మంత్రి లోకేశ్ తెలిపారు. రాజ్‌రెడ్డి తనను గైడ్ చేశారని చెప్పారు. ఫీల్డ్‌లో మంచిగా పనిచేస్తున్న ఉపాద్యాయులతో వారానికి ఒకరితో కుర్చోని మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ఆ మధ్య కాలంలో అటవీశాఖ రాష్ట్ర అధికారి ఒకరు హఠాత్తుగా మరణించారు. తాడేపల్లి(Tadepalli)లో ఆయన ఉండేది అద్దె ఇల్లు కావటంతో శవాన్ని అక్కడికి తీసుకురావద్దని ఇంటి యజమాని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు గుంటూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచి అక్కడ నుంచే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.
Vijayawada: విజయవాడ పెనుమలూరులో దారుణం జరిగింది. 'జై జగన్' అని అనలేదని ఓ బీజేపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు.. గంగాధర్, బొర్రా వెంకట్ దాడి చేసి, డబ్బులు లాక్కొని.. బట్టలు ఊడదీసి అవమానించారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.
ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...
జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విజయవాడ నారాయణ కళాశాల విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంకు సాధించిన...
దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్ వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి..
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
డిజిటల్ మూల్యాంకన కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. పీఎస్‌ఆర్, మధుసూదన్‌ను రెండోరోజూ ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు.