విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమ
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:21 PM
కనకదుర్గమ్మ నవరాత్రుల నేపథ్యంలో విజయవాడ ఉత్సవాల ఏర్పాటు పనులను ఎమ్మెల్యే బోండా ఉమ పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విజయవాడ, అక్టోబర్ 4: విజయవాడ నవరాత్రోత్సవాల సందర్భంగా సింగ్‌నగర్ ఎంబీకే స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే బోండా ఉమ పరిశీలించారు. కళావేదికలు, స్టాల్స్, అతిథులు వచ్చే మార్గాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
‘మైసూరు తరహాలో విజయవాడలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా పది రోజులపాటు విజయవాడలో వేడుకలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ వైభవంగా జరిగింది. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ సారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉత్సవ్‌కు వేదిక కానుంది. సింగ్‌నగర్ బసవ పున్నయ్య స్టేడియంలో ఈనెల 11వ తేదీ నుంచి పది రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయి. దానితోపాటు పున్నమిఘాట్ తదితర ప్రాంతాల్లో కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. భక్తులందరికీ ఈ కార్యక్రమాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం: మంత్రి కొండపల్లి
నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత.. ప్రత్యేక పూజలు