బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:07 AM
బీసీ కులం నుంచి వచ్చిన తాను మంత్రిగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశమేనని ఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విజయనగరం, అక్టోబర్ 04: బీసీ కులం నుంచి వచ్చిన తాను మంత్రిగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశమేనని ఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన వాదన వినిపిస్తామని అన్నారు.
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 34 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలుచేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు పనిచేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. గతంలో బీసీలకు ఇచ్చిన 23 శాతం రిజర్వేషన్ తగదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. బీసీల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును కూటమి ప్రభుత్వం ఆశ్రయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు: మంత్రి లోకేశ్
అలిపిరిలో హైటెక్ వ్యభిచారం.. పలువురి అరెస్ట్