అలిపిరిలో హైటెక్ వ్యభిచారం.. పలువురి అరెస్ట్
ABN , Publish Date - Oct 04 , 2026 | 08:38 AM
తిరుపతి జిల్లాలోని అలిపిరిలో హైటెక్ వ్యభిచార గుట్టును పోలీసులు రట్టుచేశారు. వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లా, అక్టోబర్ 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలోని అలిపిరిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార గృహంపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. బాధిత మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
అలిపిరి సీఐ రామకిషోర్ కథనం ప్రకారం.. సంతోష్ అలియాస్ లక్ష్మి, జీవిత, శంకర్‌లు అలిపిరిలో శ్రీ ఆదిశేషారెడ్డి నగర్‌లోని శ్రీనివాస రెసిడెన్సీ హోమ్‌లో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. హైటెక్ మార్గంలో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ.. స్థానికులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా వాట్సప్ ద్వారా పలువురికి మహిళల ఫొటోలు పంపి వారిని ఆకర్షించేవారు. తదుపరి గెస్ట్‌ల్లాగా నివాస ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు రెసెడెన్సీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అస్సాం, బెంగుళూరుకు చెందిన మహిళలను తీసుకువచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం బాధిత మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. విటులను అరెస్ట్ చేశారు. కాగా.. నిర్వాహకులు జీవిత, శంకర్‌ను అరెస్ట్ చేశామని.. ప్రధాన నిర్వాహకుడు సంతోశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జ్ఞానేశ్ ఉద్వాసనకు 10న దేశవ్యాప్త నిరసనలు
తండ్రి సూపర్ ఐడియా.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు కామెంట్స్
Read Latest AP News And Telangana News