Share News

బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Oct 04 , 2026 | 09:36 AM

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు.

బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు: మంత్రి లోకేశ్

అమరావతి, అక్టోబర్ 04: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన మృతిపై ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా తాతయ్య ఎన్టీఆర్ గారు, బాలా మామయ్యలతో కలిసి పనిచేసిన సింగీతం గారు అనేక అద్భుతమైన చిత్రాలను అందించారు’.


‘బాలా మామయ్య కెరీర్‌లోనే ఆణిముత్యాల్లాంటి 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 95 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' చిత్రాన్ని తెరకెక్కించి రికార్డు సృష్టించిన బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విభిన్న చిత్రాలు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు: పవన్ కల్యాణ్

సింగీతం శ్రీనివాసరావు మరణం చిత్ర సీమకు తీరని లోటు: మంత్రి దుర్గేశ్

Updated Date - Oct 04 , 2026 | 09:44 AM