Home » Uttar Pradesh
ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ భార్య ఆగ్రహానికి గురైంది. భర్త కారును సుత్తెతో ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
యూపీలోని గౌతం బుద్ధనగర్ జిల్లా పోలీసులు గూగుల్ మ్యాప్స్‌తో కలిసి ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తాయి. తద్వారా వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దేశంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి.
మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు.. బైకర్లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు.
స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
తండ్రి కొనిచ్చిన పుట్టిన రోజు కానుక ఓ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆ యువకుడు చనిపోయాడు. అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
హెల్మెట్ పెట్టుకోని కారణంతో ట్రాఫిక్ అధికారులు ఓ బైకర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 20 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగరలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.
గ్రామస్తులంతా కలిసి దున్నపోతు రెండవ పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశారు. ఇందుకోసం ఊరంతా ఏకమైంది. డీజేలు పెట్టించారు. షేరా మెడలో దండలు వేసి, బెలూన్లు కట్టి ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడు షాహిల్‌తో కలిసి భర్తను చంపేసింది. తర్వాత శవాన్ని బ్లూ డ్రమ్‌లో కుక్కేసింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జైల్లో ఉన్నారు. ముస్కాన్ కుటుంబం అన్ని రకాలుగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఆటో డ్రైవర్‌తో గొడవ పెట్టుకుని, అతడిపై దాడికి సైతం దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.