భర్త కోతి అని పిలిచాడని.. భార్య ఆత్మహత్య..
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:41 PM
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. తన సోదరి ముందు భర్త చేసిన అవమానం భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఒక మహిళ తన భర్త మాటలకు తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలు తను సింగ్ (23).. తన భర్త రాహుల్ శ్రీవాస్తవతో కలిసి లక్నోలోని ఇందిరా నగర్‌లో ఉంటోంది. రాహుల్ నాలుగేళ్ల క్రితం.. తను సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తను సింగ్ మోడలింగ్‌లో రాణించాలని ప్రయత్నిస్తుండేది.
ఈ ఘటనపై తను సింగ్ సోదరి అంజలి మాట్లాడుతూ.. ‘బుధవారం సాయంత్రం సీతాపూర్‌లోని బంధువుల ఇంటి నుంచి దంపతులు ఇద్దరూ ఎంతో సంతోషంగా వచ్చారు. అంతా కలిసి కూర్చొని జోక్స్ వేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో రాహుల్ నవ్వుకుంటూ తను సింగ్‌ని ‘బందరియా’ (ఆడ కోతి) అని పిలిచారు. అక్కడే నేను, పిల్లలు ఉండటంతో నా సోదరి అవమానంగా ఫీల్ అయ్యింది. బాధపడుతూ వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చాలా సేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు పగులగొట్టి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కి తరలించగా.. డాక్టర్లు ఆమె చనిపోయినట్లు నిర్దారించారు. నా సోదరి తన కెరీర్, లుక్స్‌పై ఎంతో శ్రద్ద వహించేది, తన సున్నితత్వం కారణంగానే భర్త అన్న మాటలకు భరించలేక ఆత్మహత్య చేసుకుంది’ అని అన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు