Disturbing CCTV Footage: నడి రోడ్డుపై దారుణం.. మహిళను గాల్లోకి ఎత్తి పడేసిన ఎద్దు..
ABN , Publish Date - Jan 18 , 2026 | 07:10 PM
ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు ఆమెకు ఎదురుగా వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా.. కొమ్ములతో ఆమెను గాల్లోకి ఎత్తి కిందపడేసింది..
ఉత్తర ప్రదేశ్‌లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మహిళపై ఎద్దు దాడి చేసింది. ఆమెను గాల్లోకి ఎత్తి కిందపడేసింది. దీంతో ఆ మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన ఓ మహిళ మార్కెట్ ఏరియాలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ ఎద్దు ఆమెకు ఎదురుగా వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా.. ఆ ఎద్దు కొమ్ములతో ఆమెను గాల్లోకి ఎత్తి కిందపడేసింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ పైకి లేవలేకపోయింది.
అటు వైపు ఆటోలో వెళ్తున్న వారు వెంటనే ఆమెను చూసి సాయం చేయడానికి పూనుకున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ, అమ్‌రోహా, శంభాల్ జిల్లాల్లో పశువుల కారణంగా జనం గాయపడుతున్న కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులపై పశువుల దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో నెటిజన్లు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
ఒకే బైక్‌పై ధోనీ, కోహ్లీ షికారు.. అసలు సంగతి తెలిస్తే షాక్..