వంట గదిలో గొడవ.. భర్త నాలుక కోసిన భార్య.. చివరకు..
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:00 PM
దంపతులు అన్నాక గొడవలు సర్వసాధారణం. ఎంత గొడవ జరిగినా.. పాల మీద పొంగులాగా కాసేపటికి సర్దుమణుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇంకొన్నిసార్లు దాడులు, ప్రతిదాడుల వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి.
దంపతులు అన్నాక గొడవలు సర్వసాధారణం. ఎంత గొడవ జరిగినా.. పాల మీద పొంగులాగా కాసేపటికి సర్దుమణుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇంకొన్నిసార్లు దాడులు, ప్రతిదాడుల వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వంట బాలేదని అన్నందుకు భార్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. అంతటితో ఆగకుండా కత్తి తీసుకుని భర్త నాలుకను కోసేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్ జిల్లా మోడీనగర్ పరిధిలో జరిగిన ఈ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ప్రాంతానికి చెందిన విపిన్ అనే వ్యక్తి.. ఇషా అనే భార్య, తల్లి గీతతో కలిసి ఉంటున్నాడు. సంతోషంగా సాగుతున్న ఈ కుటుంబంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో విపిన్ భోజనం చేసేందుకు వంట గదిలోకి వెళ్లాడు. అయితే వంట విషయంలో భార్యాభర్తల మధ్య (Quarrel between husband and wife) గొడవ జరిగింది.
ఈ గొడవ కాసేపటికి మరింత పెద్దదై.. వేకువజాము ఒంటి గంట వరకూ వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన భార్య.. అక్కడే ఉన్న కత్తి తీసుకుని భర్తపై దాడికి దిగి.. విపిన్ నాలుకను కోసి, మంచంపై విసిరేసింది. నాలుక తెగిపోవడంతో అతను గట్టిగా కేకలు వేస్తూ.. తల్లి గది వైపు పరుగులు తీశాడు. వీరి కేకలు విని ఇరుగుపొరుగు వారు ఉరుకుపరుగున అక్కడికి చేరుకున్నారు. విపిన్ నాలుక తెగిపోయి ఉండడం చూసి చలించిపోయిన వారంతా.. ఇషాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఆమెపై దాడి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాధితుడి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని మీరట్‌లోని పెద్దాసుపత్రికి తరలించారు. నాలుక సగం తెగిపోవడం వల్ల అతడు ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఇషాపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇషా తీరుపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. చిన్న సమస్యకు ఇలా దారుణంగా నాలుక కోయడం ఏంటని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..