సంచలనం సృష్టించిన తాత.. మొదటి వీడియోతో సెలెబ్రిటీ అయిపోయాడుగా..
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:20 PM
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ ‘ఇన్‌స్టా అంకుల్’ పేరిట ఓ ఛానల్ స్టార్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం ‘డే 1 టు వన్ డే’ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఊహించని స్థాయిలో ఆదరణను దక్కించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే వయసు అడ్డురాదు. 70 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు సృష్టించవచ్చు. అనుకున్నది సాధించి అందరితో శభాష్ అనిపించుకోవచ్చు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ వృద్ధుడు 70 ఏళ్ల వయసులో సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే.. ఆయన ఊహించని విధంగా జీవితం ఒక్క వీడియోతో మారిపోయింది. అది కూడా మొదటి వీడియోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మకు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్న కోరిక ఉండేది. సోషల్ మీడియాలో వ్లాగ్స్ వీడియోలు పోస్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకునేవాడు. అయితే.. జనాలకు భయపడి కంటెంట్ క్రియేషన్ ఆలోచనను వాయిదా వేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల క్రితం భయాలను పక్కన పెట్టి ‘ఇన్‌స్టా అంకుల్’ పేరిట ఓ ఛానల్ స్టార్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం ‘డే 1 టు వన్ డే’ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఊహించని స్థాయిలో ఆదరణను దక్కించుకుంది. కేవలం 72 గంటల్లోనే ఏకంగా 3 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. అంతేకాదు.. 23 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. 41 వేల మంది కామెంట్స్ చేశారు.
కేవలం మూడు రోజుల్లోనే 'ఇన్‌స్టా అంకుల్' ఛానల్ పీక్స్‌లోకి వెళ్లిపోయింది. 66 వేల మంది ఛానల్‌ను ఫాలో అవ్వటం మొదలెట్టారు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం.. అందుకు వయసు అడ్డుకాదు.. అనేందుకు ఇన్‌స్టా అంకుల్ నిలువెత్తు నిదర్శనంగా మారిపోయారు.
ఇక.. వినోద్ కుమార్ శర్మ సక్సెస్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మీరు నిజంగా గ్రేట్ తాతగారు. మిమ్మల్ని ఈతరం వాళ్లు స్ఫూర్తిగా తీసుకోవాలి’.. ‘నీలా ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హమ్మయ్య.. భారీ నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
జగన్.. నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం: మంత్రి గొట్టిపాటి