హమ్మయ్య.. భారీ నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:56 PM
వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు గురువారం కాస్త ఊరట కలిగించాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలతో రోజును ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి.
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలు గురువారం కాస్త ఊరట కలిగించాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలతో రోజును ముగించాయి. గ్రీన్‌లాండ్ స్వాధీనం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ ఖరారవుతుందనే అంచనాలు, వరుస నష్టాల నేపథ్యంలో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు లాభపడ్డాయి. దీంతో సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (81,909)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అదే ధోరణిలో కొనసాగింది. ఒక దశలో దాదాపు 900 పాయింట్లు లాభపడి 82,783 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత కిందకు వచ్చింది. చివరకు సెన్సెక్స్ 397 పాయింట్ల లాభంతో 82,307 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 132 పాయింట్ల లాభంతో 25,289 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఇండియన్ బ్యాంక్, రెడ్డీస్ ల్యాబ్స్, ఏపీఎల్ అపోలో మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐఐఎఫ్‌ఎల్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, కల్యాణ్ జువెల్లర్స్, హిందుస్థాన్ జింక్, దాల్మియా భారత్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 399 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 767 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.62గా ఉంది.
ఇవి కూడా చదవండి..
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..