Share News

జగన్.. నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:00 PM

మాజీ సీఎం జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని చోరీ చేసిన జగన్.. క్రెడిట్ చోరీ గురించి మాట్లాడితే జనం నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

జగన్.. నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం: మంత్రి గొట్టిపాటి
Gottipati Ravikumar

అమరావతి, జనవరి 22: మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఏమిటో ఈ సందర్భంగా ప్రస్తావించారు మంత్రి గొట్టిపాటి. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని క్రెడిట్ ఇవ్వాలని ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం సహా విద్యుత్ శాఖను సర్వనాశనం చేసినందుకు జగన్ రెడ్డికి కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని వ్యంగాస్త్రాలు సంధించారు రవికుమార్.


రూ.30 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసినందుకు జగన్‌కు క్రెడిట్ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు.. పీపీఏలను రద్దు చేసినందుకు కచ్చితంగా మరో క్రెడిట్ ఇవ్వాలంటూ విమర్శలు గుప్పించారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని.. 'జగనే ఉండి ఉంటే...' అని మాట్లాడుతున్నావంటూ మాజీ సీఎంపై మండిపడ్డారు.

జగన్ ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారేదని, విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గొట్టిపాటి. రాష్ట్రాన్ని చోరీ చేసిన జగన్.. క్రెడిట్ చోరీ గురించి మాట్లాడితే జనం నవ్వుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏలూరులో పెద్ద పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీ అధికారులు

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 04:19 PM