Share News

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:00 PM

జనసేన నేతలతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారికి దిశానిర్దేశం చేశారు. జనసేనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం
Deputy CM Pawan Kalyan

అమరావతి, జనవరి 22: జనసేనపై ఎలాంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా కాపుకాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొనియాడారు. గురువారం నాడు అమరావతిలో జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులతో పవన్ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత విషయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తులు, మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయని పవన్ తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించవలసి ఉందని పార్టీ నేతలకు సూచించారాయన. రాజ్యాంగ బద్ధంగా, ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుందన్నారు. ఈ ప్రయాణంలో తోడూ నీడగా ఉన్న జనసేన శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

ఏలూరులో పెద్ద పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీ అధికారులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 03:28 PM