ఏలూరులో పెద్ద పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీ అధికారులు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:34 PM
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఏలూరు జిల్లా, జనవరి 22: బుట్టాయగూడెం మండలంలో పెద్ద పులి(Tiger) సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుండ్ల ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు.. దానిని పెద్ద పులిగా నిర్ధారించారు. అయితే.. అది వచ్చిన మార్గంలోనే వెనక్కి తిరిగి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు.
పులి సంచారం నేపథ్యంలో అంతర్వేదిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, పందిరిమామిడి గూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశువులు, ప్రజల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.
మరోవైపు.. పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ పులిని బంధించాలని పరిసర గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. పులి సంచారానికి సంబంధించి సమాచారం కోసం అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సంబంధిత అధికారుల వివరాలివే..
సబ్ డివిజనల్ అటవీ అధికారి, జంగారెడ్డిగూడెం: 9505499141
అటవీ క్షేత్రాధికారి, జంగారెడ్డిగూడెం: 9440810223
అటవీ సెక్షన్ అధికారి, ములగలంపల్లి: 9550902333
ఏలూరు కంట్రోల్ రూమ్: 9908880327
ఇవి కూడా చదవండి...
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!
Read Latest AP News And Telugu News