విశాఖ సాగర తీరంలో వేల్ షార్క్
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:10 AM
సముద్ర పర్యావరణ వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే కనిపించే భారీ వేల్ షార్క్ బుధవారం విశాఖ తీరంలో స్కూబా డైవర్లను అలరించింది.
స్కూబా డైవర్లకు కనిపించిన భారీ సొరచేప
సాగర్‌నగర్(విశాఖపట్నం), జనవరి 21(ఆంధ్రజ్యోతి): సముద్ర పర్యావరణ వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే కనిపించే భారీ వేల్ షార్క్ బుధవారం విశాఖ తీరంలో స్కూబా డైవర్లను అలరించింది. రుషికొండ వద్ద సముద్రపు అంచుల్లో డైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వేల్‌షార్క్ ప్రత్యక్షం కావడంతో స్కూబా డైవర్లు ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే కనిపిస్తాయని వారు చెప్పారు. ఇక్కడ షార్క్‌లు కనిపించడంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపున్న స్కూబా డైవింగ్ జాబితాలో విశాఖ చేరుతుందంటున్నారు. ఇప్పటికే అనేక సహజమైన పగడపు దిబ్బలు, పురాతన నౌకల శిథిలాలు ఇక్కడి తీరంలో డైవర్లను అలరిస్తున్నాయని తెలిపారు.
పర్యాటకానికి ఊతం
సముద్ర గర్భంలో అపారమైన సంపద దాగి ఉంది. ఇప్పటికే అనేక డైవింగ్ సైట్లను గుర్తించాం. మరిన్ని అన్వేషించాల్సింది ఉంది. వేల్‌షార్క్ కనిపించడం విశాఖ అంతర్జాతీయ స్థాయి డైవింగ్ హబ్‌గా ఎదగడానికి దోహదపడుతుంది. మౌలిక సదుపాయాలు, రక్షణ చర్యలు చేపడితే ప్రపంచ దేశాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తారు.
- బి.బలరాంనాయుడు, అధ్యక్షుడు, ఏపీ వాటర్ స్పోర్ట్స్
ఈ వార్తలు కూడా చదవండి:
కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్
రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం