రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:53 AM
ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.
తిరుమల, జనవరి 22: తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) గురువారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన విదేశీ పర్యటనను ముగించుకుని శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అక్కడ పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారని ఆనం వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయన్న ఆయన.. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఆనం అన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయంలో జరిగే రథ సప్తమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. సంబంధిత ఏర్పాట్లను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు సంయుక్తంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. తిరుమలలో జరిగే ఈ వేడుకలకు టీటీడీ బోర్డు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకు అన్ని రకాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారాయన.
ఇవి కూడా చదవండి...
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..
Read Latest Telangana News And AP News And Telugu News