స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి కార్మికుల మృతి
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:11 PM
ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజరార్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో బారీ పేలుడు సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బలోడా బజరార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం దట్టంగా పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
స్టీల్ ఫ్యాక్టరీలోని బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఆ సమయంలో కార్మికులు అక్కడ శుభ్రం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి వేడి బొగ్గు, దుమ్ము.. కార్మికులపై పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. మెరుగైన చికిత్స కోసం బిలాస్‌పూర్ సిమ్స్(CIMS) ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్యామ్ బిహారీ జైస్వాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
పాలిచ్చే పశువులకు చికెన్, మటన్ వ్యర్థాలు!
Read Latest Telangana News and National News