Share News

ఆరావళిలో అక్రమ మైనింగ్‌పై నిపుణుల కమిటీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:14 AM

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌ కారణంగా పర్యావరణానికి పూడ్చలేని నష్టం జరుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆ పర్వతాల్లో జరుగుతున్న మైనింగ్‌, సంబంధిత సమస్యలపై సమగ్రంగా అధ్యయనం ...

ఆరావళిలో అక్రమ మైనింగ్‌పై నిపుణుల కమిటీ

  • సభ్యుల ఎంపిక కోసం 4 వారాల్లో పేర్లు సూచించండి

  • సొలిసిటర్‌ జనరల్‌, అమికస్‌ క్యూరీకి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, జనవరి 21: ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌ కారణంగా పర్యావరణానికి పూడ్చలేని నష్టం జరుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆ పర్వతాల్లో జరుగుతున్న మైనింగ్‌, సంబంధిత సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆరావళి పర్వతాల్లో జరుగుతున్న మైనింగ్‌, ఇతర సమస్యలపై ఆ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుందని పేర్కొంది. కమిటీ నియామకం కోసం 4 వారాల్లో మైనింగ్‌లో విశేష అనుభవం ఉన్న పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తల పేర్లను సూచించాలని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎమ్‌ పంచోలీతో కూడిన ధర్మాసనం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి, అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ను ఆదేశించింది. ఈకమిటీ సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలో, పర్యవేక్షణలో పనిచేస్తోందని ధర్మాసనం స్పష్టం చేసిం ది. ఆరావళి పర్వతాల ఎత్తును నిర్వచిస్తూ నవంబరు 20న ఇచ్చిన తీర్పు ను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌ జరగొద్దని, అదే జరిగితే పర్యావరణ పరంగా తీవ్ర విపరిణామాలు సంభవిస్తాయని, వాటిని పూడ్చలేమని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - Jan 22 , 2026 | 03:14 AM