Home » Uravakonda
స్థానిక రైల్వే స్టేషనలో 24 బోగీలను నిలిపే ఫిట్ లైన్లను ఏర్పాటుచేయడానికి కృషిచేయాలంటూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం రెండు రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎంపీతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు భేటీ అయ్యారు.
పట్టణంలోని తాడిపత్రి రోడ్డులోని జంగాల కాలనీ వాసులు మంగళవారం సాయంత్రం తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గత మూడు వారాలుగా తమ కాలనీకి తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో స్వామి వారికి విశేష పూ జలు, అలంకరణ, హోమాలు చేపట్టారు. పలు ఆలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణం, సుందరకాండ పారాయణం చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదానం చేపట్టారు.
పట్టణంలోని అపోల్ సర్కిల్‌లో ఒరిగిన విద్యుత స్తం భం ప్రమాదకరంగా ఉంది. ఆ స్తం భం ఎప్పుడు కిందపడుతుందో, ఏ ప్ర మాదం జరుగుతుందోనని ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. అలాగే ఆ స్తం భం చుట్టూ గుంతలు పడ్డాయి.
పట్టణంలోని జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశా లలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిం చారు. ఇరవైఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకున్న వారు చిన్ననాటి జ్ఞాప కాలను నెమరు వేసుకున్నారు.
పాడి రైతులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం కింద పలువరు పాడి రైతులు అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్నారు. వాటిని గత యేడాది నిర్మించుకోగా ఇప్పటికీ సంబంధిత బిల్లులను జమ చేయక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. గత నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ఉత్స వాలకు అంకురార్పణ జరి గింది. 12రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఈ సంద ర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఉత్సవ విగ్రహాలతో వాహన సేవలు నిర్వహించారు.
అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్ పేర్కొన్నారు. ఇంటి స్థలాల పంపిణీ కోసం అవసరమైన, అ నువైన స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు.
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు అర్చన, ఉత్సవ నిత్య హోమం, ప్రత్యేక పూజలు చేశారు.
పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హజరుకావాలని డీఈవో ప్రసాద్‌రావు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు.