Share News

SCHOOL: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ABN , Publish Date - May 10 , 2026 | 11:53 PM

పట్టణంలోని జిల్లా పరిషత సెంట్రల్‌ ఉన్నత పాఠశా లలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిం చారు. ఇరవైఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకున్న వారు చిన్ననాటి జ్ఞాప కాలను నెమరు వేసుకున్నారు.

SCHOOL: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
Alumni of Uravakonda Central High School

ఉరవకొండ, మే10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జిల్లా పరిషత సెంట్రల్‌ ఉన్నత పాఠశా లలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిం చారు. ఇరవైఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకున్న వారు చిన్ననాటి జ్ఞాప కాలను నెమరు వేసుకున్నారు. వీరు ముందుగా అప్పటి ఉపాధ్యాయు లను సత్కరించి, పట్టణంలో ఊరేగించారు. అదే విధంగా పట్టణంలోని కరిబసవ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997- 98లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.


చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు.

యాడికి: మండలపరిధిలోని రాయలచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల లో 2005-06లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చదువుకునే రోజుల్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పదోతరగతి పూర్తయిన 20ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు జయరాములు, ఆనందరావు, చిన్నపెద్దన్న, తుకారం, రాజేశ్వరి, ఎలిజిబెత, డేనియల్‌, సుధాకర్‌, శివ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు రామనాథ్‌, సుదర్శన, అనిల్‌కు మార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూడేరు: మండలంలోని మరుట్ల -2 కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల లో 2004-05 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆది వారం ఆ పాఠశాల మైదానంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు కేసీ నాగన్న, పీఈటీ రమేష్‌బాబు, ఎర్రి స్వామి, గంగవర్ధనరాజును సన్మానించారు. అంతా సరదాగా గడిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 10 , 2026 | 11:54 PM