Share News

ప్రత్యేక తరగతులకు విద్యార్థులందరూ రావాలి

ABN , Publish Date - May 07 , 2026 | 11:34 PM

పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హజరుకావాలని డీఈవో ప్రసాద్‌రావు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు.

ప్రత్యేక తరగతులకు విద్యార్థులందరూ రావాలి
DEO Prasad Rao

- ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలి :డీఈవో

కూడేరు, మే 7(ఆంధ్రజ్యోతి): పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హజరుకావాలని డీఈవో ప్రసాద్‌రావు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫెయిల్‌ అయిన విద్యార్థుల వివరాలను హెచఎంను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో తరగతులు జరుగుతున్నాయని, తక్కువ మంది విద్యార్థులున్న చోట దగ్గరలోని పాళశాలకు వెళ్లి చదువుకోవాలన్నారు. ప్రభుత్వం స్టడీ మెటీరియల్‌ సరఫరా చేసిందని, ఈ నెల 25 వరకు విద్యార్థులకు తరగతులు జరుగుతాయని తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చదువులు చెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతులకు హజరుకాని ఫెయిల్‌ అయిన విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఫోనలో మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని డీఈవో తెలిపారు.


అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో క్వాలిఫైడ్‌ టీచర్లతో చదువులు చెబుతామని, ప్రైవేటు పాఠశాలల్లో అలాంటి అవకాశం ఉండదన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇప్పటికే చాలా పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ఒకటో తరగతి చేరుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంట ఎంఈవో-2 సాయికృష్ణ, హెచఎం శ్రీదేవి, ఎమ్మార్సీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 08 , 2026 | 07:48 AM