WATER: తాగునీటి కోసం మహిళల ఆందోళన
ABN , Publish Date - May 12 , 2026 | 11:43 PM
పట్టణంలోని తాడిపత్రి రోడ్డులోని జంగాల కాలనీ వాసులు మంగళవారం సాయంత్రం తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గత మూడు వారాలుగా తమ కాలనీకి తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గుత్తి, మే12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తాడిపత్రి రోడ్డులోని జంగాల కాలనీ వాసులు మంగళవారం సాయంత్రం తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గత మూడు వారాలుగా తమ కాలనీకి తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కొళాయిల ద్వారా సక్రమంగా తాగునీరు సరఫరా చేయలంటూ డిమాండ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు పెట్టి ఆందోళన నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులకు నచ్చజెప్పారు. సత్యసాయి కార్మికులు సమ్మెలో ఉండటంతో నీటి సమస్య ఉత్పన్నమైందని ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామనడంతో ఆందోళన విరమించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....