Share News

GOD: వైభవంగా నారసింహుడి చక్రస్నానం

ABN , Publish Date - May 08 , 2026 | 11:25 PM

మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు అర్చన, ఉత్సవ నిత్య హోమం, ప్రత్యేక పూజలు చేశారు.

GOD: వైభవంగా నారసింహుడి చక్రస్నానం
Priests performing Chakrasanam for Swami

- కోలాహలం నడుమ వసంతోత్సవం

ఉరవకొండ, మే 8(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు అర్చన, ఉత్సవ నిత్య హోమం, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వా మి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఉద్భ వలక్ష్మి ఆలయం ఎదురుగా ఉన్న మండ పానికి తీసుకొచ్చారు. అర్చకు లు గుండురావు, సాయి ఆధ్వర్యంలో శాస్రోక్తంగా ఉత్సవ మూ ర్తులకు చక్రస్నానం చేపట్టారు. అనంతరం అర్చకులు వసంతాలను చల్లుకున్నా రు. సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం రుద్రంపేటకు చెందిన యోగానందరెడ్డి కుటుంబసభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి నిర్వహించిన శయనోత్సవా నికి ఆమిద్యాలకు చెందిన సుగుణపతి కుటుంబసభ్యులు ఉభయదారు లుగా వ్యవహరించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో రమేష్‌బాబు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ అంబికా

మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామిని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో ర మేష్‌ బాబు, కమిటీ చైర్మన రేగటి నాగరాజు, అర్చకులు ఆయనకు ఘ నంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆయన పేరట అర్చనలు చేసి, ఆలయ విశిష్టతను తెలియజేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎంపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, టీడీపీ నాయకులు గోవిందు, సూరి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 08 , 2026 | 11:25 PM