Share News

RAIL: ఫిట్‌ లైన్లను ఏర్పాటుచేయాలి

ABN , Publish Date - May 12 , 2026 | 11:48 PM

స్థానిక రైల్వే స్టేషనలో 24 బోగీలను నిలిపే ఫిట్‌ లైన్లను ఏర్పాటుచేయడానికి కృషిచేయాలంటూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం రెండు రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎంపీతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు భేటీ అయ్యారు.

RAIL: ఫిట్‌ లైన్లను ఏర్పాటుచేయాలి
CPI leaders presenting petition to MP

ఎంపీ అంబికాకు సీపీఐ నాయకుల వినతి

గుంతకల్లు, మే 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషనలో 24 బోగీలను నిలిపే ఫిట్‌ లైన్లను ఏర్పాటుచేయడానికి కృషిచేయాలంటూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం రెండు రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎంపీతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. డివిజనలో తిరుపతిలో మాత్రమే ఫిట్‌ లైన్లు ఉన్నాయని, గుంతకల్లులోనూ ఏర్పాటుచేయాలన్నా రు. కరోనా సమయంలో రద్దుపరచిన డే హుబ్లీ-విజయవాడ, య శ్వంతపూర్‌-విజయవాడ ప్యాసింజరు రైళ్లను, ఇతర రైళ్లను పునః ప్రా రంభించాలని, యశ్వంతపూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం. 118111/12) రైలును బైపాస్‌లో పంపుతున్నారని, దాన్ని గుంతకల్లు మీదుగా నడ పాలన్నారు.


బెంగళూరు-అనంతపురం (నం.66560) ప్యాసింజరు రైలు ను గుంతకల్లు వరకు పొడగించాలని, గుల్బర్గా-గుంతకల్లు ప్యాసింజరు ను మరలా ప్రారంభించాలని, కాచిగూడ-కర్నూలు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ (నం.17023/24) రైలును గుంతకల్లు వరకు నడపాలని కోరారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో సీపీఐ నాయకులు బీ గోవిందు, మహమ్మద్‌ గౌస్‌, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు మీదుగా నడపండి

తిరుపతి-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (నం. 12707/08) రైలును గుత్తి మీదు గా స్టాపింగ్‌ లేకుండా వెళ్తోందని, దాన్ని గుంతకల్లు మీదుగా మళ్లించా లని స్థానిక టీడీపీ నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు విన్న వించారు. గుంతకల్లు స్టేషనలో ప్రయాణికులు వంతెన పైనుంచి దిగ డానికి కూడా ఎస్కలేటర్లను ఏర్పాటుచేయాలని, వృద్ధులకు, దివ్యాంగు లకు ఉపయోగపడేలా బగ్గీ బ్యాటరీ కార్లను ఏర్పాటుచేయాలని టీడీపీ నాయకులు అంజి, బండారు రామన్న చౌదరి, తదితరులు కోరారు. కా ర్యక్రమంలో లేబర్‌ బోర్డు చైర్మన వెంకట శివుడు యాదవ్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 12 , 2026 | 11:48 PM