Share News

MINISTER: అర్హులైన పేదలందికీ ఇళ్ల స్ధలాలిస్తాం

ABN , Publish Date - May 08 , 2026 | 11:47 PM

అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌ పేర్కొన్నారు. ఇంటి స్థలాల పంపిణీ కోసం అవసరమైన, అ నువైన స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు.

MINISTER: అర్హులైన పేదలందికీ ఇళ్ల స్ధలాలిస్తాం
Minister talking to officials about housing plots

- మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మే 8(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌ పేర్కొన్నారు. ఇంటి స్థలాల పంపిణీ కోసం అవసరమైన, అ నువైన స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు. పట్టణ శివారు లోని హోతూరు రోడ్డు, వెలిగొండ రహదారి, ఇంద్రావతి రోడ్డులో ఉన్న స్థలాలను తహసీల్దారు భోగనగౌడ్‌, సర్వేయర్‌ రత్నాకర్‌తో కలిసి పరిశీ లించారు. ఇంకా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలకు, ఇళ్ల నిర్మాణం కోసం ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌ ద్వారా అర్జీలు వస్తున్నాయని మంత్రి తెలి పారు. అలాగే పట్టణం లోని పాత తహసీల్దారు కార్యాలయం నిర్మాణం పనులను మంత్రి పరిశీలించి, త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని రోడ్లు, భవనాల ఏఈ నాగభూషణకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 08 , 2026 | 11:47 PM