Share News

GOD: ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

ABN , Publish Date - May 12 , 2026 | 11:36 PM

హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో స్వామి వారికి విశేష పూ జలు, అలంకరణ, హోమాలు చేపట్టారు. పలు ఆలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణం, సుందరకాండ పారాయణం చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదానం చేపట్టారు.

GOD: ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
Pallaki Seva to Swami at Uravakonda Indiranagar

(ఆంధ్రజ్యోతి, నెట్‌ వర్క్‌)

హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో స్వామి వారికి విశేష పూ జలు, అలంకరణ, హోమాలు చేపట్టారు. పలు ఆలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణం, సుందరకాండ పారాయణం చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదానం చేపట్టారు. గుంతకల్లు మండలం లోని కసాపురంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో నగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకా పరమే శ్వరీ దేవి ఆలయం వద్ద నుంచి హనుమాన శోభాయాత్రను నిర్వహిం చారు. భక్తులు కసాపురం దేవస్థానం వరకు పాదయాత్రగా తరలివ చ్చారు. ఆలయంలో ఉదయం లక్ష పుష్పార్చన, హోమం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొని పూజలు చేశారు. సాయంత్రం ఒంటె వాహనంపై హనుమాన ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో ఆలయ ఈఓ ఎం రాఘవరాజు, అనువంశిక ధర్మకర్త కే సుగుణ మ్మ, ఏఈఓ ఓకారం వెంకటేశ్వరుడు, ప్రధానార్చకుడు రాఘవాచార్యులు, దాతలు, భక్తులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి భక్తులు పోటేత్తెరు. ఉదయం ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌ ఆచార్యులు పూజలు నిర్వహించారు.


అదేవి దంగా ఆలయంలో సుందరకాండ పారాయణం, పవమాన హోమం జరి పించారు. ఆలయ ఆవరణంలో స్వామికి పూల రథోత్సవం నిర్వహించా రు. ఆలయ ధర్మకర్త శ్రీనాథ్‌, ఆలయ అధికారి ఓబన్న, టీడీపీ నాయ కులు సాల్లాపురం బాబు, గాలి బసప్ప, బెళ్లి హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డి. హీరేహాళ్‌ మండలంలోని మురడి గ్రామంలో ఆంజనే యస్వామికి బాలాలయంలో ఆర్చకులు పవనకుమార్‌ ఆచార్యులు పూజలు జరిపించారు. ఉదయం పంచామృతాభిషేకం, అలంకరణ అనంతరం విష్ణు సహస్ర నామపారాయణం, సుందరకాండ పారాయణం జరిపించారు. ఆలయ ఈవో నరసింహరెడ్డి, ఎంపీటీసీ గంగాధర తదితరులు పాల్గొన్నారు.

- అదేవిధంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి పట్టణాలు, మండలాలు, వజ్రకరూరు, విడపనకల్లు, కణేకల్లు, గుమ్మఘట్ట, బెళుగుప్ప, కుందుర్పి, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరు, పెద్ద వడుగూరు, పామిడి, పుట్లూరు తదితర మండలాల్లోని గ్రామాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలోని నందలపాడు అభయాంజనే యస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్లూరు మండలంలోని తక్కళ్లపల్లిలో స్వామివారికి వడమాల వేసి పూజలు చేశారు


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 12 , 2026 | 11:36 PM