Share News

GOD: ముగిసిన పెన్నోబులేశుడి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - May 09 , 2026 | 11:14 PM

మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. గత నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ఉత్స వాలకు అంకురార్పణ జరి గింది. 12రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఈ సంద ర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఉత్సవ విగ్రహాలతో వాహన సేవలు నిర్వహించారు.

GOD: ముగిసిన పెన్నోబులేశుడి బ్రహ్మోత్సవాలు
Devotees taking the Utsavamurti in procession,

- అమిద్యాలకు తిరుగు పయనమైన ఉత్సవమూర్తులు

ఉరవకొండ, మే 9(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. గత నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ఉత్స వాలకు అంకురార్పణ జరి గింది. 12రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఈ సంద ర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఉత్సవ విగ్రహాలతో వాహన సేవలు నిర్వహించారు. ఉత్సవాలు ముగియడంతో ఆనవాయితీ ప్రకారం శనివారం ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆమిద్యాల గ్రామానికి తిరిగి తీసుకెళా ్లరు. అమిద్యాలలోని పెన్నోఋలేశుడి ఆలయంలో వాటిని ఉంచుతారు. అన్ని శాఖల అధికారుల సహకారంతోనే బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ ఈవో రమేష్‌ బాబు పేర్కొన్నారు. ఉత్సవాల తిరుగు పయనం కార్యక్రమంలో ఈవోతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచా ర్యులు, సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 09 , 2026 | 11:14 PM