Share News

BILLS: గోకులం బిల్లులు రాక అవస్థలు

ABN , Publish Date - May 10 , 2026 | 11:43 PM

పాడి రైతులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం కింద పలువరు పాడి రైతులు అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్నారు. వాటిని గత యేడాది నిర్మించుకోగా ఇప్పటికీ సంబంధిత బిల్లులను జమ చేయక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

BILLS: గోకులం బిల్లులు రాక అవస్థలు
Gokulam shed built in Lattavaram

ఫకార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పాడిరైతులు

ఉరవకొండ, మే10(ఆంధ్రజ్యోతి): పాడి రైతులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం కింద పలువరు పాడి రైతులు అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్నారు. వాటిని గత యేడాది నిర్మించుకోగా ఇప్పటికీ సంబంధిత బిల్లులను జమ చేయక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 90శాతం రాయితీ వర్తిస్తుందనే యోచనతో కొందరు రైతులు గోకులం షెడ్లను నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటికి బిల్లులు రాకపోవడంతో ఆ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గత ఆర్థిక సంవత్సరం తర్వాత, ఉపాధి హామీ పథకంలో నిర్మాణాలు చేపట్టని యూనిట్లన్నీ రద్దు అయ్యాయి. ఉరవకొండ మండలంలో రెండో విడతలో 32 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో 29 నిర్మాణాలు పూర్తి కాగా, 16 షెడ్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే వజ్రకరూరు మండలంలో 30 గోకులం షెడ్లు మంజూరు కాగా 10 పూర్తి అయ్యాయి. 16 షెడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 12షెడ్లకు సంబంధించి బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. త్వరగా నిర్మాణాలు చేపడితే మార్చి లోపు బిల్లులు పడతాయని లేకపోతే రద్దు అయితాయని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో పాడి రైతులు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. అయితే నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాలేదని ఆ రైతులు తెలిపారు. అధికారులు సాంకేతిక కారణాలు సాకు చూపుతూ బిల్లులు మంజూరు చేయకుండా కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటున్నారని వారు వాపోతున్నారు.

- ఈ విషయంపై ఏపీవో సుజాతను వివరణ కోరగా సాంకేతిక సమస్యల వలన బిల్లుల చెల్లింపులో కొంత జాప్యత జరుగుతోందన్నారు. త్వరలోనే పాడి రైతుల ఖాతాల్లోకి బిల్లులు జమ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 10 , 2026 | 11:43 PM