Home » Uravakonda
హంద్రీనీవా కాలువ డిస్ర్టిబ్యూటరీల కాలువలపై ఏళ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ల పైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉరవకొం డ- గుంతకల్లు, ఉరవకొండ- హోతూరు, ఉరవకొండ- చాబాల రహ దారులు ప్రమాదకరంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హ్యాపీ-సండే కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే క్రీడా మై దానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమి షనర్ ఎం లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్, ఇతర అధికారులు క్రికెట్, షటిల్, టెన్నిస్ ఆటలలో పాల్గొన్నారు.
మండలంలోని పా ల్తూరులో సుంకులా పార్వతీ దేవి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంక రించి పూజలు చేశారు. అనంతరం ఆలయం లో కుంకుమా ర్చన చేశారు.
కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు.
మండలంలోని పాల్తూరు పోలీస్ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్ కానిస్టేబుల్ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం కల్తీదా, నాణ్యమైనదా అన్న విషయం తెలుసుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌ను ఆయన గురువారం తనిఖీ చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని అమ లు చేసిందని ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లో తాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశామని పేర్కొన్నారు.
ప్రపంచాన్ని పీడీస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ అన్నారు. పట్టణంలో మేజరు పంచాయతీ కార్యాలయం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలల ఆధ్వర్యంలో వేర్వేరుగా స్వచ్ఛంధ్రా, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఆలస్యానికి మారుపేరుగా మారిన ఆర్టీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. డొక్కు బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియక విద్యార్థులు నిత్యం భయాందోళనలతో ప్రయాణం చేస్తున్నారు.