RAIN: వర్షంతో పంట నష్టం
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:22 PM
మండల వ్యాప్తంగా రెండో రో జు బుధవారం రాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల మండల వ్యాప్తంగా 50 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. దీంతో రూ. 40 లక్షల వరకు పంట నస్టం జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా అరటి పంట దెబ్బతింది.
కూడేరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా రెండో రో జు బుధవారం రాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల మండల వ్యాప్తంగా 50 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. దీంతో రూ. 40 లక్షల వరకు పంట నస్టం జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా అరటి పంట దెబ్బతింది. నాలుగు ఎకరాల్లో సాగుచేసిన యాలక్కి జి9 రకం అరటిపంటలో దా దాపు వెయ్యి చెట్లు పడిపోయినట్లు కడదరకుంట గ్రామానికి చెందిన సరోజమ్మ తెలిపారు. ముద్దలాపురంలో అశోక్ సాగు చేసిన అరటి దెబ్బతింది. కూడేరు, ఎంఎంహళ్లి, నారాయణపురం, గొట్కూరు, కడదరకుం ట, ఉదిరిపికొండ తదితర గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారి యానిమి తెలిపారు.
పామిడి: మండలంలోని జీ కొట్టాల, దేవరపల్లి, అక్కజాంపల్లిల్లో పలువురు రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంట బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నేలకొరిగింది. దాదాపు 30 ఎకరాల్లోని పంట నేలకొరిగినట్లు మండల వ్యవసాయాధికారి విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
అలాగే అక్కజాంపల్లిలో అర్జున మామిడితోటలో కొంతమేర మామిడి కాయలు నేలరాలగా, పామిడిలో ముకుందరెడ్డి మామిడితోటలో పలు మామిడి చెట్లు నేలకొరిగాయి. పంట నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు హార్టికల్చర్ అధికారి మిత్ర పేర్కొన్నారు.
కణేకల్లు: మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లో రైతు నాగిరెడ్డి సాగుచేసిన అరటిచెట్లు బుధవారం వీచిన ఈదురుగాలులకు నేలకొరిగాయి. వెయ్యికి పైగా అరటిగెలలు కిందకు పడిపోవడంతో దాదాపు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు పేర్కొన్నారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అరటిపంట సాగుచేశానని, ప్రస్తుతం అందులోని పంటను విక్రయిస్తున్నట్లు తెలిపారు.
బెళుగుప్ప: మండలంలో బుధవారం రాత్రి 28.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 50 ఎకరాలకు పైగా నష్టం జరుగగా బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు కోనంపల్లి, గంగవరం, జీడిపల్లి, శీర్పి, బెళుగుప్ప, దుద్దేకుంట గ్రామాల్లో 120 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు ఏవో పృథ్వీసాగర్ తెలిపారు. వ్యవసాయశాఖ సిబ్బంది పరిశీలించి, పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపామని తెలిపా రు. ప్రభుత్వం ఆదుకోవాలని అరటి, మొక్కజొన్న రైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....