GOD: మురడిలో ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:25 PM
మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఉత్స వాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా ఉగాది నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహరెడ్డి తెలిపారు.
డి. హీరేహాళ్(బొమ్మనహాళ్), మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఉత్స వాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా ఉగాది నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహరెడ్డి తెలిపారు. ఈ నెల 27వరకు జరగుతాయని తెలిపారు. మొదటి రోజు గురువారం ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ చేశారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....