Share News

TRANS FORMER: ప్రమాదకరంగా ట్రాన్స ఫార్మర్లు

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:35 PM

మండలంలోని మరుట్ల రెండో కాలనీలో విద్యుత వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. చేతికందే ఎత్తులో ట్రాన్సఫార్మర్‌ అమర్చడంతో పాటు వి ద్యుత లైన్లు కిందనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరుట్ల రెండో కాలనీలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రహరీకి ఆనుకొని విద్యుత ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేశారు. దానిని తక్కువ ఎత్తులో అమర్చారు.

TRANS FORMER: ప్రమాదకరంగా ట్రాన్స ఫార్మర్లు
There is a trans farmer at a low altitude next to the Marutla school

- ఆందోళనలో స్థానికులు

కూడేరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మరుట్ల రెండో కాలనీలో విద్యుత వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. చేతికందే ఎత్తులో ట్రాన్సఫార్మర్‌ అమర్చడంతో పాటు వి ద్యుత లైన్లు కిందనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరుట్ల రెండో కాలనీలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రహరీకి ఆనుకొని విద్యుత ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేశారు. దానిని తక్కువ ఎత్తులో అమర్చారు. ఆ దారిలో నిత్యం విద్యార్థులతో పాటు వ్యవసాయ తోటల్లోకి వెళ్లే రైతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సఫార్మర్‌ను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా సంబందిత అధికారులు దానిని మార్చే ప్రయత్నం చేయడం లేదు. ఇదిలా ఉంటే గ్రామంలోని వన్నూరప్ప అనే వ్యక్తి ఇంటి వద్ద విద్యుత లైన చేతికందే ఎత్తులో ఉంది. విద్యుత స్తంభం ఏర్పాటు చేయాలని కరెంటు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా విద్యుత లైన కిందనే ఉండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం నెలకొందని చెబు తున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయం వద్ద విద్యుత స్తంభం పూర్తిగా దెబ్బతింది.


ఇలా గ్రామంలో విద్యుత వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్సఫార్మర్‌తో పాటు విద్యుత లైన్లు తదితర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలావస్థలో దిమ్మె

డి. హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌): డి. హీరేహాళ్‌ మండలంలోని సోమలాపురం గ్రామంలో విద్యుత ట్రాన్సఫార్మర్‌ ప్రమాదకర స్థితిలో ఉండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రాన్సఫార్మర్‌ను మోసే కట్ట బలహీనంగా మారి ఎప్పుడైనా కూలిపో యే స్థితికి చేరుకుంది. అలాగే ట్రాన్సఫార్మర్‌ చుట్టూ ఎలాంటి రక్షణ గోడ లేకపోవడం, వైర్లు వెలుపలికే ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారింది. గ్రామంలో పిల్లలు, పశువులు తిరిగే రోడ్డు పక్కనే ఇలా ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవంచే అవకా శం ఉందని గ్రామస్థులు అం టున్నారు. ఎప్పుడు కూలిపోతుందోనని భయపడుతున్నామని, ప్రమాదం జరిగాక స్పందిస్తారా అని విద్యుత అ ధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందిం చి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 21 , 2026 | 11:35 PM