Share News

SANITATION: గ్రామాలకు స్వచ్ఛరథం

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:58 PM

ప్రతి గ్రామాన్ని పరిశుభ్రం గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వే స్తోంది. అందులో భా గంగా ప్రతి నెల మూడో శనివారం ప్రజాప్రతిధు లు, అధికారుల, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయినా గ్రామీణ ప్రాంతాలలో కొందరు పనికిరాని వస్తువులను ఖాళీ స్థలాలలో పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు.

SANITATION: గ్రామాలకు స్వచ్ఛరథం
A scene of providing essential items from pure chariot

- వ్యర్థ పదార్థాల స్వీకరణ - నిత్యవసర సరుకుల అందజేత

రాయదుర్గంరూరల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామాన్ని పరిశుభ్రం గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వే స్తోంది. అందులో భా గంగా ప్రతి నెల మూడో శనివారం ప్రజాప్రతిధు లు, అధికారుల, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయినా గ్రామీణ ప్రాంతాలలో కొందరు పనికిరాని వస్తువులను ఖాళీ స్థలాలలో పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. దీనిని నియంత్రించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథాన్ని కేటాయించింది. స్వచ్ఛరథం గ్రామాలకు వెళ్లి ప్రజలకు పనికిరాని వస్తువులను కొనుగోలు చేసి, వాటి విలువకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తుంది. ప్రతి గ్రామంలో నెలలో రెండురోజులు


ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఈ సేవలు అందిస్తారు. పాత ఇనుము, కాగితాలు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్‌, గాజు సీసాలు, స్టీల్‌, అల్యూమినియం వస్తువులను కిలో లెక్కన కొనుగోలు చేస్తున్నారు. ధరలలో వ్యత్యాసాలు రాకుండా ప్రభుత్వమే నిర్ణయించడం గమనార్హం. ప్రజల వద్ద సేకరించిన పాత వస్తువులను కొనుగోలు చేసి, వాటి విలువకు సరిపడే విధంగా మార్కెట్‌లో చెల్లుబాటులో ఉండే ప్రముఖ కంపెనీలకు చెందిన 17 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఇందులో కందిపప్పు, గోధుమలు, ఉల్లిపాయ, కొబ్బరినూనె, టీ, కాఫీ పొడి, పేస్టు, అట్టపెట్టెలు, షాంపూలు, పెన్నులు, టూతపేస్టులు తదితర నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు అందిస్తున్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యం - ఎంపీడీవో కొండన్న

గ్రామాలను స్వచ్ఛందంగా తీర్చిద్దిడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. స్వచ్ఛరథం సేవలను గ్రామీణ ప్రాంత ప్రజల సద్వినియోగం చేసుకోవాలి. వ్యర్థ పదార్థాలను ఇష్టానుసారంగా పడి వేయకుండా స్వచ్ఛరథం వచ్చినప్పుడు అందించి నిత్యావసర సరుకులను పొందవ చ్చు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 20 , 2026 | 11:58 PM