FESTIVAL: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:41 PM
మండలం లోని నాయకునిపల్లి శివారులో వెలసిన బాట సుంకులమ్మ తిరుణాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భం గా అమ్మ వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. అమ్మవారి ఆలయం పక్కన వె లసిన ఆంజనేయస్వామికి ప్ర త్యేక పూజలు చేశారు.
పుట్లూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలం లోని నాయకునిపల్లి శివారులో వెలసిన బాట సుంకులమ్మ తిరుణాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భం గా అమ్మ వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. అమ్మవారి ఆలయం పక్కన వె లసిన ఆంజనేయస్వామికి ప్ర త్యేక పూజలు చేశారు. రెండు రోజుల పాటు జరిగే తిరుణాల సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
మహిళలు అమ్మవారికి గాజులు, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద రాతిదూలం లాగుడు పోటీలను టీడీపీ నాయకులు ప్రా రం భించారు. గెలుపొందిన వృషభాలకు నగదు బహుమతులను అందజేశా రు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు.
యాడికి: ఉగాది పండుగను పురస్కరించుకొని మండలంలోని పెద్దపేటలో సంజీవరాయస్వామి ఆలయం వద్ద శనివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. పోటీలను టీడీపీ నాయకులు పరిమి చరణ్ ప్రారంభించారు. గెలుపొందిన వృషభాలకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. మొ దటి బహుమతి రూ.25,116, రెండో బహుమతి రూ.20,116, మూడో బహుమతి రూ.10,116, నాలుగో బహుమతి రూ.5,116, ఐదో బహుమతి రూ. 4,116, ఆరో బహుమతి రూ.3116, ఏడో బహుమతి రూ.2,116లను అందజేశారు. పోటీలో పాల్గొన్న మిగిలిన ఎద్దులకు కన్సొలేషన బహుమ తులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్ రుద్రమ నాయుడు, బహుమతుల దాతలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....